Wednesday, 29 August 2012

విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ

8/29/2012 12:30:00 PM
పులివెందుల : కరెంటు కోతలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో ధర్నా చేపట్టింది. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏడు గంటలు కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాతున్నారని విజయమ్మ మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైటు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలపై పరిశ్రమలన్నీ మూతపడే దుస్థితి నెలకొందన్నారు. అదనపు విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజయమ్మ అన్నారు.
                                                                                                                                            -by siddu reddy

Tuesday, 28 August 2012

NDTV Survey ......





NDTV Survey ...... Says the support to Jagan is increasing exponentially day after day....... This is just beginning....
 — with Ysrjagan Reddy,     -By Siddu Reddy.

Monday, 27 August 2012

'విజయమ్మ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా'

8/27/2012 3:06:00 PM
హైదరాబాద్ : వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 'దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’అని నిన్న విజయమ్మ మంత్రులను సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

వైఎస్ బతికొస్తే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం మంత్రులకు లేదని శంకర్రావు సోమవారమిక్కడ అన్నారు. మంత్రులు తప్పుచేసి ఆ నెపాన్ని వైఎస్ఆర్ పై నెట్టడం సరికాదన్నారు. వైఎస్ ను విమర్శిస్తే ప్రజలు సహించరని.... ఆయనను దూషించటం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగటం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని శంకర్రావు విమర్శించారు.    -by siddu reddy.

ఈనెల 31న రాష్ట్ర బంద్: వైఎస్ఆర్ సీపీ

8/27/2012 2:23:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలకు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల(ఆగస్టు) 28, 29, 30 తేదీల్లో మండలస్థాయి నిరసనలు, 31న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. కరెంటు కోతలపై ఇప్పటికే పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడంలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అడ్డూ అదుపులేని కరెంటు కోతలతో వ్యవసాయం, నేత, పారిశ్రామికరంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అసమర్థత కారణంగా పలు పరిశ్రమలు మూతపడాల్సి వస్తోందని, దీంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా సిగ్గులేని ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తూ, చార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆందోళనకు ప్రతీకగా మూడు రోజులపాటు విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేయించడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోల రూపంలో తీవ్ర నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నామన్నారు.     -By Siddu Reddy.

వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష భేటీ

8/27/2012 12:15:00 PM
హైదరాబాద్ : ప్రజాసమస్యల్ని విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణను రూపొందించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సోమవారం సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

ప్రజా సమస్యలపై పోరుకు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. విద్యుత్ సంక్షోభం, శిశు మరణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై చర్చించనున్నారు. ప్రజాసమస్యలు సంక్షోభస్థాయికి చేరినందున తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయనుంది.
                                                                                             -By Siddu reddy.

Sunday, 26 August 2012

వైఎస్ కళ్లలోకి చూడగలరా?

విమర్శిస్తున్న మంత్రులకు విజయమ్మ సూటి ప్రశ్న
8/27/2012 1:30:00 AM
మరణించిన వైఎస్ జవాబు చెప్పుకోలేరనే అలా మాట్లాడుతున్నారు
కథలు అల్లించి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు
నాడు వైఎస్ కేబినెట్ భేటీల్లో మంత్రులు ఎందుకు మాట్లాడలేదు?
ఆ 26 జీవోలూ సక్రమమా అక్రమమా అని ఈ సర్కారు తేల్చదెందుకు?
సక్రమం అంటే జగన్‌కు మేలు, అక్రమం అంటే సర్కారుకు చేటు అనే కదా!
వైఎస్ మరణించిన తర్వాత మూడేళ్లుగా పాలన అస్తవ్యస్తంగా మారింది
వర్షాల్లేవు, విత్తనాల్లేవు, కరెంటు లేదు.. ఎవరూ సంతోషంగా లేరు
సర్కారు మొద్దునిద్ర వదిలేలా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రారంభమైన ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమంలో విజయమ్మ పిలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు.. వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించారు. మరణించిన వైఎస్ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరు కనుక ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైఎస్ ఫొటో లేకుండా చేసినా ఏమీ మాట్లాడని మంత్రులు.. ఇపుడు వైఎస్‌ను ఉద్దేశించి తలో రకంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు.

‘‘ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రకరకాల కథలు అల్లిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఒక మంత్రి అంటున్నారు.. ఆయనకు కనుక పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే వైఎస్ హయాంలో జరిగినవన్నీ చెబుతారట! ఇంకొక మంత్రి అంటున్నారు.. తనను క్యాంపు ఆఫీసుకు పిలిపించి తనతో సంతకం చేయించారని! ఇంకొకరైతే తాను హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారని చెప్తున్నారు! ఇంకొకరేమో కేబినెట్ నిర్ణయాలన్నీ సమష్టిగా చేసినవేనని.. అందులో ఏమీ లేదు గానీ తెర వెనుక ఏదో బాగోతం నడిచిందని.. అది వారికి తెలియనే తెలియదని అంటున్నారు! ఇంకొకరైతే కేబినెట్ సమావేశాల్లో ఓ రకమైన చర్చ జరిపారనీ ఫైల్లో మాత్రం మరో విధంగా ఉందని అంటున్నారు. ఇంకొకాయన రాజశేఖరరెడ్డిగారు చాలా పవర్ ఫుల్ అని.. ఆయన ముందర ఏమీ మాట్లాడలేక పోయామని చెప్తున్నారు!’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ఆదివారం ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

ఈ మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోందని.. అదే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, జలయజ్ఞం వంటి అంశాలతో వైఎస్ అధికారులను పరుగులు పెట్టించేవారని పేర్కొన్నారు. అలాంటపుడు మంత్రులు ఈ విషయాలపై ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆమె నిలదీశారు. ‘‘ఆ రోజు ఈ మంత్రులు కేబినెట్‌లో ఎందుకు మాట్లాడలేక పోయారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారో వారికే తెలియాలి. అపుడు ఏమీ మాట్లాడని వారు ఇపుడిలా మాట్లాడతుంటే మనసుకు చాలా కష్టం కలుగుతోంది. భాధ అనిపిస్తోంది. వైఎస్ సజీవంగా వచ్చి వారి ముందర నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా వీరు చూడగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఆ జీవోలు సక్రమమా.. అక్రమమా.. చెప్పరేం?: అసలు అప్పట్లో జారీ అయిన 26 జీవోలు సక్రమమా, అక్రమమా అనేది ప్రభుత్వం ఇంత వరకూ చెప్పటం లేదని విజయమ్మ ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. ‘‘జీవోలు సక్రమమని చెప్తే జగన్‌మోహన్‌రెడ్డికి మేలు జరుగుతుంది. అక్రమమని చెప్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.. అందుకే సమాధానం చెప్పటం లేదు’’ అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘‘అసలు జగన్‌కు ఏం సంబంధం..? ఆయన అపుడేమైనా ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నారా? మంత్రిగా పనిచేశారా? లేక అధికారిగా ఏమైనా ఉన్నారా?’’ అని ఆమె నిలదీశారు. జగన్‌ను విచారణ కోసమని పిలిచి సీబీఐ అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 90 రోజులైందని ఆమె ఆవేదనగా చెప్పారు. జగన్‌బాబును టార్గెట్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు కోర్టుల్లో కేసులు వేసిన దరిమిలా జీవోల విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే మంత్రులకు ఈ దుర్గతి పట్టి ఉండేదే కాదన్నా రు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ కుమ్మక్కయి వైఎస్‌నూ జగన్‌నూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిట్టటమే పనిగా పెట్టుకున్నాయని విజయమ్మ విమర్శించారు.

వైఎస్ తర్వాత పాలన అస్తవ్యస్తం...: వైఎస్ ప్రజల మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మూడేళ్లుగా పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడటం లేదనీ పడినా విత్తనాలు లభించడం లేదనీ ఎరువుల ధరలు 300 శాతం పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. ఇక కరెంటు విషయానికి వస్తే ప్రభుత్వమే గ్రామాల్లో 12 గంటలు కోత అని అధికారికంగా ప్రకటించిందనీ దాంతో రెండు మూడు గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. దారుణమైన పరిస్థితి కారణంగా ఒక్క పులివెందులలోనే 500 కోట్ల రూపాయల మేరకు చీనీ తోటలకు నష్టం వాటిల్లిందని.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరెంత నష్టం జరిగిందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్ కోత విధించిన కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయని.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏ వర్గమూ సంతోషంగా లేదు.. : ప్రస్తుతప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారింది.. ఫీజుల రీయింబర్స్‌మెంటు పథకం ఉంటుందో లేదో తెలియదు... 2009 ఎన్నికల్లో వైఎస్ ఇచ్చింది రెండు హామీలే! ఒక్కొక్కరికి ఇపుడిస్తున్న నాలుగు కేజీల బియ్యం నుంచి ఆరు కేజీలు ఇస్తామని.. వ్యవసాయానికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా చేస్తామని.. చెప్పారు. ఈ రెండు హామీలనూ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది’’ అని దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..: వైఎస్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల కాలం సువర్ణయుగమని.. మళ్లీ అలాంటి పాలన తెచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని.. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునే వరకూ కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదని.. ఇది మానవతావాద పార్టీ అని ఆమె స్పష్టంచేశారు. వైఎస్ ఏ విధంగానైతే సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూసి ముందుకు తీసుకెళ్లారో తమ పార్టీ కూడా అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సభలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆయన అనుచరులతో సహా చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, రోజా, రాజ్‌సింగ్‌ఠాకూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, ఎం.మారెప్ప, డి.రవీంద్రనాయక్ సహా పలువురు పాల్గొన్నారు.           -by Siddu reddy.

రంగారెడ్డి జిల్లాలో విజయమ్మ పర్యటన

26-08-2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను విజయమ్మ వివరించే అవకాశం ఉంది. 

భారీ స్వాగత సన్నాహాలు...
గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ ఏర్పాట్లను పరిశీలించారు.         

Saturday, 25 August 2012

జగన్ అరెస్ట్ అక్రమమని లక్ష సంతకాలు !!

25-08-2012.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అక్రమమని అంబర్ పేట వాసి విజేతా రెడ్డి లక్ష సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె గవర్నర్ ను కలిసేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రాజ్ భవన్ వర్గాలు ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దాంతో విజేతారెడ్డి శనివారం రాజ్ భవన్ ముందు దీక్షకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.                 

Thursday, 23 August 2012

........





                                  


                   







వైఎస్ఆర్ ఆదర్శనీయుడు: వైఎస్ అవినాష్

8/23/2012 7:28:00 PM
అనంతపురం: ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. వైఎస్ బాటలో నడుస్తూ నాయకుడు అంటే ఎలా ఉండాలో వైఎస్ జగన్ చాటి చెబుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసినందునే వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించిదని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. 
       

Monday, 20 August 2012

రైతులకు పరిహారం అందించాలి: విజయమ్మ

8/20/2012 6:52:00 PM
కడప: పులివెందుల పరిధిలో అరటి, చినీ, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కలెక్టర్‌ను కోరానని వైఎస్ విజయమ్మ తెలిపారు. తుంగభద్ర నీటి విడుదలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని విజయమ్మ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించిన వైఎస్ విజయమ్మ... రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. 
                           

విజయమ్మ లేఖపై తీవ్ర చర్చ

8/20/2012 11:00:00 AM
హైదరాబాద్ : వంద టిక్కెట్లు కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు వంద సీట్లిద్దామన్న వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ పొలిటికల్‌ మైలేజీ కోసం బీసీ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చినా... వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనపై ఏ విధంగా రెస్పాండ్‌ అవుతుందో అనేది ఆ పార్టీకి డైలామానే.

అయితే మిగతా పక్షాలు మాత్రం వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. అన్ని పార్టీలు దీనిపై సీరియస్‌గా ఆలోచించాలని అభిప్రాయపడ్డాయి. దీని కంటే ముందు ఎన్నికల సంస్కరణలు వస్తే వంద సీట్ల వంటి ప్రతిపాదనలు సత్ ఫలితాలు ఇస్తాయని టీఆర్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఈ అంశంపై సోమవారం ఉదయం సాక్షి హెడ్‌లైన్‌షోలో చర్చ జరిగింది.            

చంద్రబాబుకు విజయమ్మ బహిరంగ లేఖ

8/20/2012 1:41:00 AM


శాసనసభలో బీసీలు తలెత్తుకునేలా చేద్దాం 
చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే ముందుకు రండి..
బీసీలపై చంద్రబాబు కారుస్తున్నవి మొసలి కన్నీళ్లే 
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఏం చేశారు బాబూ?
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 100 సీట్లు ఇస్తామన్నారు 
కానీ ఇచ్చింది 47 టికెట్లే.. అదీ మీ చరిత్ర.. మీ నైజం 
అదే ఎన్నికల్లో బీసీలకు వైఎస్‌ఆర్ 67 టికెట్లు ఇచ్చారు
వంద టికెట్లు కాదు.. బీసీలకు 100 సీట్లిద్దాం రండి
బీసీ జనాభాను బట్టి వంద నియోజకవర్గాలను లాటరీతో నిర్ణయిద్దాం.. ఆ సీట్లలో బీసీలను మాత్రమే నిలబెడదాం
మాతోపాటు టీడీపీ కూడా ముందుకొస్తే.. మిగతా పార్టీలూ అదే బాటలో నడిచే అవకాశముంది..

బాబూ! మీరు సబ్సిడీలు ఉండరాదన్నారు.. సేద్యం దండగన్నారు 
బీసీలను దగా చేసి.. కులవృత్తులను ధ్వంసం చేశారు
ఎన్టీఆర్ జనతా వస్త్రాల పథకాన్ని మీరు రద్దు చేశారు 
పిల్లల చదువుల గురించి ఏనాడైనా ఆలోచించారా? 
అనారోగ్యం పాలైనప్పుడు ప్రజలను ఆదుకున్నారా? 
ప్రభుత్వాస్పత్రుల్లోనూ యూజర్ చార్జీలు వడ్డించారు 
నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఆలోచన చేశారా?     

Tuesday, 14 August 2012

తాడిమర్రికి చేరిన అవినాష్

14-08-2012

అనంతపురం : పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ తో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర మంగళవారం తాడిమర్రికి చేరింది. కాగా చిన్నకొండయ్యపల్లెలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అవినాష్ రెడ్డి పాదయాత్రను అడ్డుకున్నారు. అయితే రైతుల కోసమే తాము పాదయాత్ర చేస్తున్నామని ఆయన ముందుకు సాగారు.

అవినాష్ రెడ్డి పాదయాత్రకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మవరం డీఎస్పీ నవాబు చాన్ తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతిచ్చినట్లు ఆయన చెప్పారు.

వైఎస్ సువర్ణ పాలన మళ్లీ వస్తుంది: సురేఖ

14-08-2012

శ్రీశైలం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మల్లన్నను ప్రార్థించామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కొండా సురేఖ తెలిపారు. వైఎస్ కుటుంబం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రజలు గమనిస్తున్నారని, తమ పార్టీపై కూడా కక్ష కట్టిందని ఆమె మంగళశారమిక్కడ అన్నారు. వైఎస్‌ఆర్‌ సువర్ణ పాలన మళ్లీ కచ్చితంగా వస్తుందని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన ఆమె శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ముగిసిన విజయమ్మ దీక్ష

14-08-2012

ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష విరమించారు. విద్యార్థినులు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షని విరమింపజేశారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ పథకంని సక్రమంగా కొనసాగించాలన్న డిమాండ్ తో ఆమె నిన్న మధ్యాహ్నం దీక్ష ప్రారంభించారు.

Sunday, 12 August 2012

రేపు విజయమ్మ దీక్ష యథాతథం

8/12/2012 9:05:00 PM
హైదరాబాద్: విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ పై మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటనలో స్పష్టత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందువల్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ముందుగా ప్రకటించిన విధంగా ఏలూరులో రేపు దీక్ష ప్రారంభిస్తారని పార్టీ తెలిపింది. రేపు, ఎల్లుండి విజయమ్మ దీక్ష చేస్తారు.

వైఎస్ఆర్ సీపీ లో చేరిన విజయారెడ్డి

8/12/2012 2:19:00 PM
హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ నేత పీ. జనార్ధన్ రెడ్డి కూతురు విజయారెడ్డి ఆదివారం మధ్యాహ్నం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయారెడ్డి వేలాది మంది కార్యకర్తల కోలాహలం మధ్య పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. విజయారెడ్డికి పార్టీనేతలు రోజా, రహ్మన్ లు స్వాగతం పలికి పార్టీ కండువాను కప్పారు.

వైఎస్ఆర్సిపికి అసెంబ్లీలో కార్యాలయం

8/12/2012 6:15:00 PM
హైదరాబాద్: ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఒక కార్యాలయాన్ని కేటాయించారు. ఈ ఉదయం లాంఛనంగా పూజాదికాలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీకి 17 మంది ఎంఎల్ఏలు ఉన్నారు.

Friday, 10 August 2012

12న వైఎస్సార్‌సీపీలోకి విజయారెడ్డి

8/11/2012 2:48:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డి ఈనెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 9 గం టలకు ఖైరతాబాద్‌లోని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో వెళ్లి వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ చేసిన సేవలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అయితే ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నియోజకవర్గంలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని విమర్శించారు. పీజేఆర్ కుటుంబ సభ్యులు ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని, దీనిపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. తన తండ్రి పీజేఆర్ ఆశయాలు అమలు కావాలంటే అందుకు యువరక్తం నింపుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసలైన వేదిక అని స్పష్టంచేశారు

విజయమ్మ దీక్ష పోస్టర్ విడుదల

8/11/2012 2:57:00 AM
ఏలూరు (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న 48 గంటల ఫీజు దీక్ష పోస్టర్‌ను ఏలూరులో శుక్రవారం విడుదల చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

విజయమ్మ దీక్ష ఒక రోజు వాయిదా!

8/10/2012 2:26:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష ఒక రోజు వాయిదా పడింది. తొలుత ఈ దీక్షను ఈ నెల 12, 13 తేదీల్లో చేయాలని భావించారు. 12న ఏపీపీఎస్సీ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు 13, 14 తేదీల్లో దీక్ష చేయాలని తాజాగా నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం వెల్లడించారు.

ఫీజుపోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

8/10/2012 1:29:00 PM
ఏలూరు: విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష పోస్టర్ ను ఆపార్టీ నేతలు శుక్కవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే ముదినూరి ప్రసాదరాజు, తోట గోపి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని దశలవారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఒక్కసారే పథకాన్ని ఎత్తివేస్తే తీవ్ర ప్రతిఘటన వస్తుందని సర్కార్ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు న్యాయ చేసేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని నాని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని... అర్హులైన బీసీ విద్యార్థులందరికీ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు.

Wednesday, 8 August 2012

ఎంపీగా మేకపాటి ప్రమాణం

ఇప్పుడు ఇద్దరమే.. మున్ముందు పెద్ద సమూహంగా మారతాం
8/9/2012 2:25:00 AM
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి 2.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే.. సభ్యులందరూ నిలబడి జాతీయ గీతాలాపన చేశారు. గీతాలాపన ముగిసిన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేపట్టారు.

మొదటగా నెల్లూరు స్థానం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన మేకపాటి పేరును పిలిచారు. ఆయన పోడియం ముందుకు వచ్చి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక మేకపాటి స్పీకర్ మీరాకుమార్‌కు అభివాదం చేసి సభ్యుల రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆ తర్వాత తనకు కేటాయించిన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మేకపాటి తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తరఫున కనౌజ్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన డింపుల్‌యాదవ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆమెతో స్పీకర్ కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

బలమైన శక్తిగా ఎదుగుతాం: మేకపాటి
ఉప ఎన్నికల్లో తన విజయం పూర్తిగా ప్రజల విజయమని ఎంపీ మేకపాటి అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మీద అభిమానాన్ని ఓటర్లు ఎన్నికల్లో చూపారని.. అందుకే తనకు ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం పార్లమెంటులో తమ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులం మాత్రమే ఉన్నామని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగి పెద్ద సమూహం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. నేడు జాతీయ పార్టీలుగా ఉన్న పార్టీలన్నీ మొదట ఒకరిద్దరు సభ్యులతోనే తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయని గుర్తు చేశారు. రానున్న కాలంలో తమ పార్టీ బలీయశక్తిగా ఎదుగుతుందని.. దాన్ని ఎవరూ నిలువరించలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన అనంతరం ఆయన పార్లమెంట్ బయట విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. గత నెల 30న నెల్లూరు సమీపంలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ‘ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి?’ అని ప్రశ్నించగా.. 2014 నాటికి చాలామంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, తర్వాత వస్తే స్క్రూటినీ చేసి పార్టీలోకి తీసుకుంటామని మేకపాటి బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని.. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆత్రుత తమకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా?’ అని ప్రశ్నించగా.. ‘‘మాకు దగ్గర కావాలని కాంగ్రెస్ ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు’’ అని బదులిచ్చారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి లౌకిక శక్తులతో మాత్రమే కలుస్తామని జగన్ ఎప్పుడో చెప్పారని.. అదే మాటపై ఉంటారని తామంతా గట్టిగా నమ్ముతున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

ఎంపీగా మేకపాటి ప్రమాణ స్వీకారం

8/8/2012 11:35:00 AM
న్యూఢిల్లీ : నెల్లూరు నుంచి ఎంపీగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఎంపీలుగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, సమాజ్‌ వాది పార్టీ నాయకురాలు, యూపీ సీఎం సతీమణి డింపుల్‌ యాదవ్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, డింపుల్‌ యాదవ్‌ హిందీలో ప్రమాణం చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు

8/8/2012 4:05:00 PM
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నామని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలందరూ ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tuesday, 7 August 2012

విలీనంపై వైఖరేంటో వైఎస్సార్‌సీపీ చెప్పాలి: దాడి

8/8/2012 1:48:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే సమాచారం తమకు తెలుస్తోందని, అయితే అది ఏ రోజున జరగనుందో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభ ద్రరావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? చేయరా? చేస్తే ఎపుడు చేస్తారు? లేదా చేయకుండా ప్రస్తుతానికి ప్రత్యర్థిగా కొనసాగుతూ 2014 ఎన్నికల తర్వాత కలిపేస్తారా? కానిపక్షంలో శరద్‌పవార్, మమతా బెనర్జీలాగా అనుబంధ పార్టీగా కొనసాగిస్తారా? అనేది ఆ పార్టీ ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలిసి తాము ఉద్యమించబోమన్నారు. అయితే సీపీఐ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కాకతాళీయంగానే తమ పార్టీ నేత పాల్గొన్నారని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పాలసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు

8/8/2012 2:15:00 AM
దళిత, గిరిజనుల అభ్యున్నతికి నూతన విధానం
రూపకల్పనపై పార్టీ నేతల అధ్యయనం
సబ్‌ప్లాన్, ఇతర పథకాలు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయం
ఎస్సీ, ఎస్టీల సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపేలా ముసాయిదా
వైఎస్సార్ ఉండుంటే సబ్ ప్లాన్‌కు ఎప్పుడో చట్టబద్ధత వచ్చి ఉండేది: జూపూడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక విధానాన్ని (పాలసీని) తీసుకురావాలని యోచిస్తోంది. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌తో పాటు పలు పథకాలు పక్కదారి పట్టకుండా అరికట్టాలని నిర్ణయించింది.

ఈమేరకు నూతన ముసాయిదా రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై నూతన విధానం రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు బృందం మీడియాకు వెల్లడించింది. మహానేత వైఎస్ ఆశయ సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళితుల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపేలా ఒక ముసాయిదా రూపొందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని, ఆయన ఆమోదం లభించాక వైఎస్సార్ కాంగ్రెస్ పాలసీగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేదల కోసం వైఎస్ చేసినన్ని మంచి పనులు దేశంలో మరే ఇతర సీఎం చేయలేకపోయారని వివరించారు. ఎస్సీ, ఎస్టీల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు, ఆయన రెక్కల కష్టంమీద ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉండుంటే సబ్‌ప్లాన్‌కు ఎప్పుడో చట్టబద్ధత వచ్చుండేదని చెప్పారు. మహానేత లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని, దళితులకు ఇది తీరని లోటన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషనర్ మేరుగ నాగార్జున, సీజీసీ సభ్యుడు చందా లింగయ్య దొర, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ కమిటీ భేటీ

8/7/2012 4:13:00 PM
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ఓ కొత్త పాలసీ సిద్ధం చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతిపాదిత పాలసీ సిద్ధం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ కమిటీ అందజేయనుంది. దళితులు, గిరిజనుల సమస్యలను పూర్తిగా పరిశీలించి పాలసీ రూపొందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. దేశం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. జగన్‌ సూచనలతో పాలసీ విధివిధానాలు త్వరలో మీడియాకు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జూపూడి ప్రభాకరరావు, గొల్ల బాబూరావు, నల్లా సూర్యప్రకాశ్‌, కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Monday, 6 August 2012

వైఎస్‌ఆర్సీపీ యువజన విభాగంలోకి లింకన్

8/7/2012 1:57:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడుగా దాసరి అబ్రహాం లింకన్ నియమితులయ్యారు. కృష్ణా జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా అబ్దుల్ రహీంను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరి గినట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు.

‘ఫీజులు’ ఎగ్గొట్టాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు

‘ఫీజులు’ ఎగ్గొట్టాలని చూస్తోంది
రాష్ట్ర ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు
8/7/2012 1:52:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, అందుకే మంత్రుల ఉప సంఘం ఆంక్షలను విధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సోమవారమిక్కడ కొందరు మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెడితే.. దాన్నెలాగైనా నీరుగార్చాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇప్పటికే చిన్న పొరపాట్లను సాకుగా చూపి.. ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థులను ఫీజుల పథకం నుంచి తప్పించారని.. మంత్రుల నిబంధనల వల్ల ఇంకా చాలా మంది విద్యార్థులు నష్టపోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫీజుల పథకానికి తూట్లు పొడుస్తున్న విషయాన్ని గ్రహించి మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలోనే హైదరాబాద్‌లో వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ పథకాన్ని రక్షించుకునేందుకు ఇప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 12, 13 తేదీల్లో ఏలూరులో దీక్ష చేయ సంకల్పించారు’ అని చెప్పారు. 
న్యాయం మనపక్షమే: విజయమ్మ

టీడీపీ, కాంగ్రెస్‌లు అన్యాయంగా, అక్రమంగా జగన్‌బాబును జైల్లో పెట్టించాయి. జరుగుతున్నదంతా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. న్యాయం మనపక్షానే ఉంది. సుప్రీం కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో ఏర్పాటుచేసిన దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు కాంస్యవిగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం షెల్టన్ హోటల్‌లో ముస్లిం మహిళలతో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ప్రతి మహిళవద్దకూ వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విజయమ్మ ఆప్యాయతకు ముస్లిం మహిళలు ఉద్వేగభరితులయ్యారు. విజయమ్మను ఆలిం గనం చేసుకుని తమ అభిమానాన్ని చాటారు






    YSR Congress Party Office Address:  Road No:12,
                                                             Near Lotus Pond,
                                                             MLA Colony,
                                                             Banjara Hills.
                                  
                                   Phone Number: (040) 2465331, 24653535