హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే సమాచారం తమకు తెలుస్తోందని, అయితే అది ఏ రోజున జరగనుందో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభ ద్రరావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? చేయరా? చేస్తే ఎపుడు చేస్తారు? లేదా చేయకుండా ప్రస్తుతానికి ప్రత్యర్థిగా కొనసాగుతూ 2014 ఎన్నికల తర్వాత కలిపేస్తారా? కానిపక్షంలో శరద్‌పవార్, మమతా బెనర్జీలాగా అనుబంధ పార్టీగా కొనసాగిస్తారా? అనేది ఆ పార్టీ ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలిసి తాము ఉద్యమించబోమన్నారు. అయితే సీపీఐ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కాకతాళీయంగానే తమ పార్టీ నేత పాల్గొన్నారని చెప్పారు.
|
No comments:
Post a Comment