Wednesday, 29 August 2012

విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ

8/29/2012 12:30:00 PM
పులివెందుల : కరెంటు కోతలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో ధర్నా చేపట్టింది. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏడు గంటలు కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాతున్నారని విజయమ్మ మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైటు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలపై పరిశ్రమలన్నీ మూతపడే దుస్థితి నెలకొందన్నారు. అదనపు విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజయమ్మ అన్నారు.
                                                                                                                                            -by siddu reddy

Tuesday, 28 August 2012

NDTV Survey ......





NDTV Survey ...... Says the support to Jagan is increasing exponentially day after day....... This is just beginning....
 — with Ysrjagan Reddy,     -By Siddu Reddy.

Monday, 27 August 2012

'విజయమ్మ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా'

8/27/2012 3:06:00 PM
హైదరాబాద్ : వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 'దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’అని నిన్న విజయమ్మ మంత్రులను సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

వైఎస్ బతికొస్తే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం మంత్రులకు లేదని శంకర్రావు సోమవారమిక్కడ అన్నారు. మంత్రులు తప్పుచేసి ఆ నెపాన్ని వైఎస్ఆర్ పై నెట్టడం సరికాదన్నారు. వైఎస్ ను విమర్శిస్తే ప్రజలు సహించరని.... ఆయనను దూషించటం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగటం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని శంకర్రావు విమర్శించారు.    -by siddu reddy.

ఈనెల 31న రాష్ట్ర బంద్: వైఎస్ఆర్ సీపీ

8/27/2012 2:23:00 AM
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలకు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల(ఆగస్టు) 28, 29, 30 తేదీల్లో మండలస్థాయి నిరసనలు, 31న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. కరెంటు కోతలపై ఇప్పటికే పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడంలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అడ్డూ అదుపులేని కరెంటు కోతలతో వ్యవసాయం, నేత, పారిశ్రామికరంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అసమర్థత కారణంగా పలు పరిశ్రమలు మూతపడాల్సి వస్తోందని, దీంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. అయినా సిగ్గులేని ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తూ, చార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆందోళనకు ప్రతీకగా మూడు రోజులపాటు విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేయించడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోల రూపంలో తీవ్ర నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నామన్నారు.     -By Siddu Reddy.

వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష భేటీ

8/27/2012 12:15:00 PM
హైదరాబాద్ : ప్రజాసమస్యల్ని విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణను రూపొందించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సోమవారం సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

ప్రజా సమస్యలపై పోరుకు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. విద్యుత్ సంక్షోభం, శిశు మరణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై చర్చించనున్నారు. ప్రజాసమస్యలు సంక్షోభస్థాయికి చేరినందున తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయనుంది.
                                                                                             -By Siddu reddy.

Sunday, 26 August 2012

వైఎస్ కళ్లలోకి చూడగలరా?

విమర్శిస్తున్న మంత్రులకు విజయమ్మ సూటి ప్రశ్న
8/27/2012 1:30:00 AM
మరణించిన వైఎస్ జవాబు చెప్పుకోలేరనే అలా మాట్లాడుతున్నారు
కథలు అల్లించి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు
నాడు వైఎస్ కేబినెట్ భేటీల్లో మంత్రులు ఎందుకు మాట్లాడలేదు?
ఆ 26 జీవోలూ సక్రమమా అక్రమమా అని ఈ సర్కారు తేల్చదెందుకు?
సక్రమం అంటే జగన్‌కు మేలు, అక్రమం అంటే సర్కారుకు చేటు అనే కదా!
వైఎస్ మరణించిన తర్వాత మూడేళ్లుగా పాలన అస్తవ్యస్తంగా మారింది
వర్షాల్లేవు, విత్తనాల్లేవు, కరెంటు లేదు.. ఎవరూ సంతోషంగా లేరు
సర్కారు మొద్దునిద్ర వదిలేలా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రారంభమైన ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమంలో విజయమ్మ పిలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు.. వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించారు. మరణించిన వైఎస్ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరు కనుక ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైఎస్ ఫొటో లేకుండా చేసినా ఏమీ మాట్లాడని మంత్రులు.. ఇపుడు వైఎస్‌ను ఉద్దేశించి తలో రకంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు.

‘‘ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రకరకాల కథలు అల్లిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఒక మంత్రి అంటున్నారు.. ఆయనకు కనుక పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే వైఎస్ హయాంలో జరిగినవన్నీ చెబుతారట! ఇంకొక మంత్రి అంటున్నారు.. తనను క్యాంపు ఆఫీసుకు పిలిపించి తనతో సంతకం చేయించారని! ఇంకొకరైతే తాను హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారని చెప్తున్నారు! ఇంకొకరేమో కేబినెట్ నిర్ణయాలన్నీ సమష్టిగా చేసినవేనని.. అందులో ఏమీ లేదు గానీ తెర వెనుక ఏదో బాగోతం నడిచిందని.. అది వారికి తెలియనే తెలియదని అంటున్నారు! ఇంకొకరైతే కేబినెట్ సమావేశాల్లో ఓ రకమైన చర్చ జరిపారనీ ఫైల్లో మాత్రం మరో విధంగా ఉందని అంటున్నారు. ఇంకొకాయన రాజశేఖరరెడ్డిగారు చాలా పవర్ ఫుల్ అని.. ఆయన ముందర ఏమీ మాట్లాడలేక పోయామని చెప్తున్నారు!’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ఆదివారం ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

ఈ మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోందని.. అదే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, జలయజ్ఞం వంటి అంశాలతో వైఎస్ అధికారులను పరుగులు పెట్టించేవారని పేర్కొన్నారు. అలాంటపుడు మంత్రులు ఈ విషయాలపై ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆమె నిలదీశారు. ‘‘ఆ రోజు ఈ మంత్రులు కేబినెట్‌లో ఎందుకు మాట్లాడలేక పోయారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారో వారికే తెలియాలి. అపుడు ఏమీ మాట్లాడని వారు ఇపుడిలా మాట్లాడతుంటే మనసుకు చాలా కష్టం కలుగుతోంది. భాధ అనిపిస్తోంది. వైఎస్ సజీవంగా వచ్చి వారి ముందర నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా వీరు చూడగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఆ జీవోలు సక్రమమా.. అక్రమమా.. చెప్పరేం?: అసలు అప్పట్లో జారీ అయిన 26 జీవోలు సక్రమమా, అక్రమమా అనేది ప్రభుత్వం ఇంత వరకూ చెప్పటం లేదని విజయమ్మ ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. ‘‘జీవోలు సక్రమమని చెప్తే జగన్‌మోహన్‌రెడ్డికి మేలు జరుగుతుంది. అక్రమమని చెప్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.. అందుకే సమాధానం చెప్పటం లేదు’’ అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘‘అసలు జగన్‌కు ఏం సంబంధం..? ఆయన అపుడేమైనా ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నారా? మంత్రిగా పనిచేశారా? లేక అధికారిగా ఏమైనా ఉన్నారా?’’ అని ఆమె నిలదీశారు. జగన్‌ను విచారణ కోసమని పిలిచి సీబీఐ అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 90 రోజులైందని ఆమె ఆవేదనగా చెప్పారు. జగన్‌బాబును టార్గెట్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు కోర్టుల్లో కేసులు వేసిన దరిమిలా జీవోల విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే మంత్రులకు ఈ దుర్గతి పట్టి ఉండేదే కాదన్నా రు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ కుమ్మక్కయి వైఎస్‌నూ జగన్‌నూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిట్టటమే పనిగా పెట్టుకున్నాయని విజయమ్మ విమర్శించారు.

వైఎస్ తర్వాత పాలన అస్తవ్యస్తం...: వైఎస్ ప్రజల మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మూడేళ్లుగా పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడటం లేదనీ పడినా విత్తనాలు లభించడం లేదనీ ఎరువుల ధరలు 300 శాతం పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. ఇక కరెంటు విషయానికి వస్తే ప్రభుత్వమే గ్రామాల్లో 12 గంటలు కోత అని అధికారికంగా ప్రకటించిందనీ దాంతో రెండు మూడు గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. దారుణమైన పరిస్థితి కారణంగా ఒక్క పులివెందులలోనే 500 కోట్ల రూపాయల మేరకు చీనీ తోటలకు నష్టం వాటిల్లిందని.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరెంత నష్టం జరిగిందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్ కోత విధించిన కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయని.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏ వర్గమూ సంతోషంగా లేదు.. : ప్రస్తుతప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారింది.. ఫీజుల రీయింబర్స్‌మెంటు పథకం ఉంటుందో లేదో తెలియదు... 2009 ఎన్నికల్లో వైఎస్ ఇచ్చింది రెండు హామీలే! ఒక్కొక్కరికి ఇపుడిస్తున్న నాలుగు కేజీల బియ్యం నుంచి ఆరు కేజీలు ఇస్తామని.. వ్యవసాయానికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా చేస్తామని.. చెప్పారు. ఈ రెండు హామీలనూ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది’’ అని దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..: వైఎస్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల కాలం సువర్ణయుగమని.. మళ్లీ అలాంటి పాలన తెచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని.. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునే వరకూ కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదని.. ఇది మానవతావాద పార్టీ అని ఆమె స్పష్టంచేశారు. వైఎస్ ఏ విధంగానైతే సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూసి ముందుకు తీసుకెళ్లారో తమ పార్టీ కూడా అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సభలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆయన అనుచరులతో సహా చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, రోజా, రాజ్‌సింగ్‌ఠాకూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, ఎం.మారెప్ప, డి.రవీంద్రనాయక్ సహా పలువురు పాల్గొన్నారు.           -by Siddu reddy.

రంగారెడ్డి జిల్లాలో విజయమ్మ పర్యటన

26-08-2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను విజయమ్మ వివరించే అవకాశం ఉంది. 

భారీ స్వాగత సన్నాహాలు...
గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ ఏర్పాట్లను పరిశీలించారు.