Wednesday, 10 January 2018

Ys Jagan || వైఎస్‌ జగన్ పాదయాత్ర ‌@ 800 కి.మీ || Prajasankalpayatra || A...

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

YS Jagan జగన్ కు అనీ CBI కేసుల్లొ క్లీన్ చిట్

Monday, 18 March 2013

2013-14 బడ్జెట్ స్వరూపం

2013-14 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ స్వరూపం ఇలా ఉంది. ఆదాయం ఎలా వస్తుంది.. ఏ విధంగా ఖర్చవుతుందో వివరాలివీ.. 

Sunday, 17 March 2013


mana hyd youvatha vot jagan ke yekkuva shatam moggu chuparu.....
mana hyd youvatha vot jagan ke yekkuva shatam moggu chuparu.....
hi friends .. See and Share our party MARO PRAJA PRASTHANAM SONG. "Vasthunnai Jagannadha Radha Chekralu". thank you frds -Siddarthan Reddy. 

Saturday, 1 September 2012

ఫీజుపై విజయమ్మ పోరు

6, 7 తేదీల్లో నిరాహార దీక్ష
9/2/2012 1:21:00 AM
రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసన
బీసీలు, నిరుపేదలను అడ్డుకునేందుకే ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ మండిపాటు.. శాచ్యురేషన్ స్థాయిలో అమలుకు డిమాండ్
ఫీజులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేయడం ఇది రెండోసారి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాటాల పరంపరలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పాలకుల కళ్లు తెరిపించేందుకు సిద్ధమైంది. విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నందుకు నిరసనగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షను చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో రెండ్రోజులపాటు ఆమె నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఒక్కో పథకాన్ని ప్రభుత్వం కుంటిసాకులతో నీరుగారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి చెబుతోంది. బీసీలు, నిరుపేదలను ఉన్నత విద్యకు దూరం చేసేలా ప్రభుత్వం తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పలు నిబంధనలు పెట్టి అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. శాచ్యురేషన్ (సంతృప్తస్థాయిలో) స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ దీక్ష చేపట్టడం ఇది రెండోసారి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యాకోర్సులు చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఫీజుల ఖరారులో జాప్యాన్ని నిరసిస్తూ ఏలూరులో ఆమె ఆగస్టు 13, 14 తేదీల్లో నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ పథకం కింద లబ్ధి పొందే విద్యార్థుల విషయంలో పరిమితులను విధించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఫీజు పోరు పేరుతో నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

పాలకులు ఇప్పటికైనా నిద్ర లేవాలి

ఫీజుల పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయమ్మ చేస్తున్న దీక్షతోనైనా పాలకులు మేల్కొనాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుత పాలకుల చేతకానితనం కారణంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఫీజుల పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
                                                                                                                                                                -siddu reddy.

నేడు మహానేత మూడో వర్ధంతి

ఘన నివాళికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఏర్పాట్లు
9/2/2012 3:12:00 AM
రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద
శ్రద్ధాంజలి ఘటించనున్న విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. రక్తదానం, అన్నదానంతోపాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద ప్రార్థనలు జరిపి, శ్ర ద్ధాంజలి ఘటిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు.

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ సేవాదళం ఆధ్వర్యంలో ఇక్కడో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 2,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకూ వైఎస్ సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి. వైఎస్ మరణించిన నల్లకాలువ వద్ద కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ పేదమహిళలకు చీరల పంపిణీ చేయడంతో పాటుగా కొవ్వొత్తులు వెలిగించి మహానేతకు నివాళులర్పిస్తారు.
                                                                                                   -Siddu reddy

Wednesday, 29 August 2012

విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ

8/29/2012 12:30:00 PM
పులివెందుల : కరెంటు కోతలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో ధర్నా చేపట్టింది. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏడు గంటలు కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాతున్నారని విజయమ్మ మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైటు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలపై పరిశ్రమలన్నీ మూతపడే దుస్థితి నెలకొందన్నారు. అదనపు విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజయమ్మ అన్నారు.
                                                                                                                                            -by siddu reddy

Tuesday, 28 August 2012

NDTV Survey ......





NDTV Survey ...... Says the support to Jagan is increasing exponentially day after day....... This is just beginning....
 — with Ysrjagan Reddy,     -By Siddu Reddy.